బ్రిటన్ సెన్సార్ బోర్డుకు ‘పద్మావతి’ సెగ... నిరసనకు రాజ్ పుత్ ల సన్నాహం!
- విడుదలకు బ్రిటన్ సెన్సార్ బోర్డు లైన్ క్లియర్
- నో కటింగ్స్... 12ఎ రేటింగ్
- నిరసనకు లండన్ లోని రాజ్ పుత్ వర్గీయుల సన్నాహం
పద్మావతి సినిమాకు ఏ విధమైన కత్తెరలు విధించకుండా ఉన్నది ఉన్నట్టుగానే సినిమా విడుదల చేసుకునేందుకు బ్రిటిష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బీబీఎఫ్ సీ) పచ్చ జెండా ఉపింది. పద్మావతి సినిమా ఓ మోస్తరు హింసతో మాత్రమె ఉందని పేర్కొంటూ 12ఎ రేటింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎటువంటి కటింగ్ లు లేకుండా అనుమతిస్తున్నట్టు సెన్సార్ బోర్డు తెలిపింది. 12ఎ రేటింగ్ అంటే బ్రిటన్ వ్యాప్తంగా ఈ సినిమాను 12 ఏళ్లలోపు పిల్లలు పెద్దలతో పాటు వెళ్లి మాత్రమే చూడచ్చు.