భర్తను 8 ముక్కలుగా నరికిన మహిళ, ఆమె ప్రియుడికి కఠిన శిక్షను విధించిన కోర్టు
- అక్రమ సంబంధంతో భర్త హత్య
- శరీరం ముక్కలను ఇంట్లోనే దాచిన భార్య, ప్రియుడు
- 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించిన కోర్టు
ఈ క్రమంలో ఓ వైపు పోలీసు విచారణ జరుగుతుండగానే, మరో వైపు కుటుంబసభ్యులు తమ వంతుగా ఆమె ఇంట్లో వెతికారు. దాంతో తమ సోదరుడు హత్యకు గురయ్యాడనే నిజాన్ని వారు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత పూజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూశాయి. తమ పొరుగునే నివసించే ఓ వ్యక్తితో తనకు శారీరక సంబంధం ఉందని... ఈ నేపథ్యంలోనే, ఇద్దరం కలసి బల్జీత్ ను చంపేశామని ఒప్పుకున్నారు.
ఆ తర్వాత కోర్టు విచారణలో ఇరువైపు వాదనలు విన్న జడ్జి... పూజ, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని రుజువైందని చెప్పారు. వీరిద్దరికీ 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్టు తీర్పును వెలువరించారు.
2016 ఏప్రిల్ లో బల్జీత్ శరీరాన్ని 8 ముక్కలుగా నరికి ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఆ భాగాలను ఉంచారు.