తొలి టెస్ట్‌లో బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఆసక్తిగా చూసిన ప్రేక్షకులు!

19-11-2017 Sun 06:53 | Sports
  • కండరాలు పట్టేడయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న షమీ
  • బంతి అందుకుని పూర్తి చేసిన కోహ్లీ
  • ఆసక్తిగా చూసిన క్రికెటర్లు, ప్రేక్షకులు
భారత్-శ్రీలంక మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్ ఆలౌట్ అయిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 45వ ఓవర్ వేస్తున్న భారత పేసర్ మహమ్మద్ షమీ ఓవర్‌ను పూర్తి చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఐదు బంతులు వేసి ఆరో బంతి వేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేశాయి. నడవడం కూడా ఇబ్బందిగా మారడంతో  విషయాన్ని అంపైర్, కెప్టెన్ కోహ్లీ దృష్టికి తీసుకెళ్లి మైదానాన్ని వీడాడు.

దీంతో ఆ ఓవర్‌ను పూర్తిచేసే బాధ్యతను కోహ్లీ తీసుకుని బంతిని అందుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క బంతిని వేసి ఓవర్ పూర్తిచేశాడు. బంతిని ఎదుర్కొన్న డిక్వెల్లా డిఫెన్స్ ఆడాడు. కాగా, మూడో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిరోషన్ డిక్వెల్లా 14, దినేశన్ చండీమాల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌట్ అయింది.
Virat KohliBowlingSri Lanka

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more