సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

18-11-2017 Sat 07:27 | Entertainment
  • ఈ ప్రయాణం చాలా ఇష్టమంటున్న సమంత
  • బ్రేక్ తీసుకుంటున్న డా.రాజశేఖర్ 
  • కూతురికి తల్లిగా నటిస్తున్న శ్రీదేవి 
  • నెలాఖరుకి 'రంగస్థలం' టాకీ పూర్తి
*  'ఈ సినిమా ప్రయాణం అంటే నాకెంతో ఇష్టం..' అంటోంది ప్రెట్టీ డాల్ సమంత. 'సినిమాలలో నేను చేయాలనుకున్న పాత్రలు వాటికవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అందుకేనేమో, సినిమాలపై ప్రేమ మరింత ఎక్కువై ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనిపిస్తుంది. నటన పరంగా ఇదంతా ఓ చాప్టర్. ఇకపై నటించేది మరో చాప్టర్. ఇంకా మంచి మంచి పాత్రలు వస్తాయని అనుకుంటున్నాను' అని చెప్పింది.    
*  ఇటీవల విడుదలైన 'గరుడ వేగా' చిత్రంతో మంచి విజయాన్ని సాధించి మళ్లీ సక్సెస్ బాట పట్టిన డా.రాజశేఖర్ తన తదుపరి చిత్రం విషయంలో కంగారుపడడం లేదు. అందుకే, ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదట. కథలు వింటున్నప్పటికీ ఎవరికీ ఓకే చెప్పలేదు. ముందు కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటానని, ఆ తర్వాత తదుపరి చిత్రాన్ని చేస్తానని రాజశేఖర్ చెబుతున్నారు.    
*  నాటి అందాలతార శ్రీదేవి తనయ జాహ్నవి 'ధడక్' అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు, కూతురికి తల్లిగా సినిమాలో ఆమె కనిపించనున్నట్టు సమాచారం.
*  రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం టాకీ పార్ట్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. దీంతో వచ్చే నెలలో పాటల చిత్రీకరణ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన సమంత నాయికగా నటిస్తోంది.   
SamantaraajashekharshrideviCharan

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more