మిర్యాలగూడలో దారుణం... భర్త బాకీ పడ్డాడని భార్యను చెరబట్టిన బడా వ్యాపారి!

17-11-2017 Fri 10:18 | Both States
  • వ్యాపారంలో గొడవలు రావడంతో విడిపోయిన సత్యప్రసాద్, మోహన్ రావు
  • డబ్బు కోసం సత్యప్రసాద్ ఒత్తిడి
  • ఇవ్వడం లేదని మోహన్ రావు భార్యను నెల రోజుల పాటు బంధించిన వైనం
ఓ వ్యక్తి తనకు రావాల్సిన డబ్బును ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఆయన భార్యను నెల రోజుల పాటు చెరబట్టాడో వ్యాపారి. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నందిగామకు చెందిన సింగిరికొండ మోహన్ రావు, మిర్యాలగూడకు చెందిన కనపర్తి సత్యప్రసాద్ లు కొంత డబ్బు పెట్టుబడి పెట్టి, యూరో బనియన్స్, జిందా తిలిస్మాత్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని వ్యాపారం చేశారు.

తర్వాత గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆపై తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మోహన్ రావుపై సత్యప్రసాద్ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కోర్టు కేసు నిమిత్తం మిర్యాలగూడకు వచ్చిన మోహన్ రావు దంపతులను డబ్బుకోసం సత్యప్రసాద్ గృహనిర్బంధం చేశాడు. మూడు రోజుల తరువాత డబ్బు తేవాలని బెదిరిస్తూ, మోహన్ రావును మాత్రం వదిలి, అతని భార్యను మాత్రం పంపలేదు.

ఆమెను బెదిరించి ఇంటి పనులు చేయించుకున్నాడు. నందిగామ వెళ్లిన మోహన్ రావు, తనకు భార్యతో కలిపి జాయింట్ ఖాతా ఉందని, ఆమె కూడా వస్తేనే డబ్బు తెచ్చే వీలవుతుందని  చెప్పడంతో, ఆమెను తీసుకుని నందిగామ వెళ్లారు. ఎలాగోలా సత్యప్రసాద్ నుంచి తప్పించుకున్న ఆ జంట, నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించగా, తాను ఎవరినీ బంధించలేదని, డబ్బు ఇవ్వకుండా తప్పించుకునేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం.
miryalagudabusinessman

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more