హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం!
- బొల్లారంలోని ఓ కంపెనీలో పట్టుబడ్డ డ్రగ్స్
- 179 కిలోల ఎపిడ్రిన్ స్వాధీనం
- దీని విలువ రూ. 5 కోట్లని అంచనా
- రియాక్టర్ ను లీజుకు తీసుకుని దందా
కాగా, ఇదే ప్రాంతంలో గతంలోనూ డ్రగ్స్ వెలుగుచూడటం గమనార్హం. ఈ కంపెనీకి ఎటువంటి పేరూ లేదని, 15 రోజుల పాటు కంపెనీలోని రియాక్టర్ ను రూ. 2 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్న వ్యక్తులు, ఎపిడ్రిన్ ను తయారు చేశారని పేర్కొన్నారు. ఎపిడ్రిన్ తో పాటు మెటామిథామైన్ ను కూడా వీరు తయారు చేస్తున్నారని తెలిపారు. రానున్న నూతన సంవత్సరం వేడుకలు లక్ష్యంగా వీరు ఈ దందా మొదలు పెట్టినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు అధికార వర్గాల సమాచారం.