మహేశ్ కోసం అనుకున్న టైటిల్ తో విశాల్ మూవీ!

15-11-2017 Wed 15:38 | Entertainment
  • సంక్రాంతికి విశాల్ 'ఇరుంబు తిరాయ్'
  • తెలుగు టైటిల్ గా 'అభిమన్యుడు'
  • కథానాయికగా సమంత 
  • కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్  
మహేశ్ బాబు .. మురుగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ కి ముందు పరిశీలించిన పేర్లలో 'అభిమన్యుడు' ఒకటి. కొన్ని కారణాల వలన ఈ సినిమా టీమ్ ఈ టైటిల్ ను పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆ టైటిల్ తో తెలుగులోకి విశాల్ మూవీ రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం విశాల్ తమిళంలో 'ఇరుంబు తిరాయ్' అనే సినిమా చేస్తున్నాడు.

 విశాల్ సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను సంక్రాంతికి విడుదల కానుంది. తమిళంలో 'ఇరుంబు తిరాయ్' అంటే 'ఇనుప తెర' అని అర్థం. తాజాగా తెలుగులో ఈ సినిమాకి 'అభిమన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. తెలుగులో రీసెంట్ గా వచ్చిన విశాల్ 'డిటెక్టివ్'కి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ఇక ఈ సినిమా అయినా తెలుగులో ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.   
vishalsamanta

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more