శాసన మండలి, అసెంబ్లీకి కొత్త పదవులు ప్రకటించిన చంద్రబాబు
- శాసనమండలి చైర్మన్ గా ఎండీ ఫరూక్
- మండలి చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్
- అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డి
- ఐదుగురికి విప్ పదవులు.. గవర్నర్ ఆమోదానికి జాబితా
అసెంబ్లీ చీఫ్ విప్ గా పల్లె రఘునాథరెడ్డిని ప్రకటించిన ఆయన, ఇద్దరికి విప్ పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను అసెంబ్లీ విప్ లుగా చంద్రబాబు ఎంచుకున్నారు. ఈ జాబితాను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ ఆమోదించిన తక్షణమే, వారు పదవులను స్వీకరించనున్నారు.