రాహుల్ గాంధీ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మారారు: ముఖ్త‌ర్‌ అబ్బాస్ న‌ఖ్వీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మారారు: ముఖ్త‌ర్‌ అబ్బాస్ న‌ఖ్వీ

  • రాహుల్‌కి గొప్ప‌ రాజ‌కీయ‌నాయకుడు అయ్యే అవ‌కాశం ఉంది
  • కానీ, కాలేక‌పోతున్నారు
  • కాంగ్రెస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లేదు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత, కేంద్ర మంత్రి ముఖ్త‌ర్‌ అబ్బాస్ న‌ఖ్వీ విమ‌ర్శ‌లు గుప్పించారు. రాహుల్ గాంధీ ఒక మిమిక్రి ఆర్టిస్ట్‌గా మారిపోయార‌ని అన్నారు. రాహుల్ చేస్తోన్న ప్ర‌సంగాలు చూస్తోంటే త‌న‌కు అలాగే అనిపిస్తోంద‌ని ఎద్దేవా చేశారు.

రాహుల్‌కి గొప్ప‌ రాజ‌కీయ‌నాయకుడు అయ్యే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కాలేక‌పోతున్నార‌ని చుర‌క‌లంటించారు. కాంగ్రెస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని, మంచి పాల‌సీ కూడా లేద‌ని వి‌మర్శించారు. అటువంటి పార్టీ ఉపాధ్య‌క్షుడు గుజ‌రాత్‌ను అభివృద్ధి చేస్తామ‌ని త‌మ‌కే ఓట్లు వేయాల‌ని వ్యాఖ్యానిస్తున్నాడ‌ని అన్నారు.
mukhtar abbas naqvi
rahul gandhi
BJP

More Telugu News