టీటీడీపీకి మరో షాక్.. రేపు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి కీలక నేత గండ్ర సత్యనారాయణ
- రేవంత్‌ రెడ్డి గుడ్ బై చెప్పిన త‌రువాత టీటీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు
- జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి గండ్ర స‌త్య‌నారాయ‌ణ రాజీనామా
- చంద్ర‌బాబుకి అందిన‌ రాజీనామా లేఖ‌
టీటీడీపీలోంచి ఇతర పార్టీలలోకి జంపింగ్లు కొనసాగుతున్నాయి. టీటీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పిన తరువాత ఆ పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా వలసలు వెళుతోన్న విషయం తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ కూడా ఈ రోజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పంపారు. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో గండ్ర సత్యనారాయణ చేరనున్నారు. దీంతో టీటీడీపీకి మరో షాక్ తగిలింది.