ప్రమాదం నుంచి ఇలా బయటపడ్డాం.. వెల్లడించిన బోటు ప్రమాద బాధితులు!

14-11-2017 Tue 08:26 | Andhra
  • మృత్యుంజయుల మనోగతం
  • బోటులో వేలాడడం వల్లే బతికి బయటపడ్డామన్న బాధితులు
  • తమ కళ్లముందే కుటుంబ సభ్యులు మృతి చెందారంటూ కన్నీటి పర్యంతం
కృష్ణానదిలో బోటు ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తామెలా బయటపడిందీ వివరించారు. ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదం నుంచి బొడ్డు లక్ష్మి, కఠారి భూలక్ష్మి, రావిపాటి సుబ్బాయమ్మ, డి.విజయశ్రీలు గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కఠారి భూలక్ష్మి సోమవారం ఉదయం కన్నుమూశారు. బొడ్డు లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కోలుకుంటున్నారు. కోలుకుంటున్న సుబ్బాయమ్మ, విజయశ్రీలు తామెలా తిరిగి పునర్జన్మ పొందిందీ వివరించారు.

సుబ్బాయమ్మ మాట్లాడుతూ తాను ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు నుంచి వచ్చానని వివరించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పున్నమి బోటింగ్ పాయింట్ నుంచి బయలుదేరామని, అక్కడి నుంచి గంటలోనే పవిత్ర సంగమానికి చేరుకున్నట్టు వివరించారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణానికి మరో గంట పడుతుందని అనుకుంటుండగానే బోటు తిరగబడిందని పేర్కొన్నారు.

తాను బోటుపై ఉన్న ఇనుప రాడ్డును పట్టుకుని వేలాడుతూ ఉండిపోయానని, అలా వేలాడడం వల్లే బతికి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. నీళ్లలో మెడ వరకు మునిగిన తాను గంటకుపైగా వేలాడుతూనే ఉన్నానని వివరించారు. ప్రమాదం గురించి తెలిసి రక్షించేందుకు వచ్చిన వారితో తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఒడ్డుకు చేర్చారని సుబ్బాయమ్మ వివరించారు. ప్రమాదంలో తన అన్నయ్య మృతి చెందారని, మిగిలిన వారు ఎలా ఉన్నారో కూడా తెలియదని కన్నీటి పర్యంతమయ్యారు.

నెల్లూరుకు చెందిన  విజయశ్రీ మాట్లాడుతూ కార్తీక దీపోత్సవం కోసం అక్క కుమార్తె హరిత పిలవడంతో విజయవాడ వచ్చానని, అక్కడి నుంచి పవిత్ర సంగమానికి వెళ్లాలని అనుకున్నట్టు చెప్పారు. పున్నమిఘాట్‌కు వచ్చాక బోటులో పవిత్ర సంగమానికి వెళ్దామన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే మార్గమధ్యంలోనే బోటు బోల్తా పడిందని, తాను నీటిలో పడిపోయి బోటును పట్టుకుని వేలాడుతూ ఉండడం వల్లే పునర్జన్మ లభించిందని పేర్కొన్నారు. తనతోపాటు వచ్చిన అక్క కుమార్తె హరిత, ఆమె కుమార్తె అశ్విక, అత్తయ్య లలితాంబ చనిపోయినట్టు వివరించారు.
Krishna RiverBoatTragedy

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more