రేపు సర్ ప్రైజ్ చేస్తానంటోన్న అఖిల్!
- అఖిల్ తాజా చిత్రంగా 'హలో'
- దాదాపు 42 కోట్ల బడ్జెట్
- రేపు టీజర్ రిలీజ్ చేయవచ్చనే టాక్
- క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 22న సినిమా విడుదల
ఈ సినిమా టీజర్ కి నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చాడనే వార్త ఆల్రెడీ బయటికి వచ్చేసింది. ఆ టీజర్ ను రేపు వదలనున్నారని అఖిల్ మాటల వలన అర్థమవుతోంది. నాగార్జున ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 42 కోట్ల వరకూ ఖర్చు చేయడం వలన, ప్రతి విషయంలోను నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా ఆయన ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాతో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.