పడవ బోల్తా ప్రమాద ఘ‌ట‌న‌పై స్పందించిన ప్రధాని మోదీ

  • పడవ ప్రమాదం ఘ‌ట‌న నన్ను కలచివేసింది
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం 
  • సహాయక చర్యలు కొనసాగుతున్నాయి 
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కృష్ణా పవిత్ర సంగమం వద్ద నిన్న‌ సాయంత్రం ఓ పడవ బోల్తా పడడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాద ఘ‌ట‌న త‌న‌ను ఎంతగానో కలచి వేసిందని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Narendra Modi
boat
Andhra Pradesh
government

More Telugu News