విజయవాడ కృష్ణా నదిలో బోటు బోల్తా.. ఐదుగురి మృతి, 10 మంది గల్లంతు

  • ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ప్రమాదం
  • భవానీ ఐలాండ్ నుంచి పవిత్ర సంగమం వైపు వెళుతుండగా విషాదం
  • మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
విజయవాడలోని కృష్ణా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమం వైపు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 20 మంది ప్రయాణికులను కాపాడగా, మరో 10 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. మొత్తం 35 మంది ప్రయాణికులతో ఈ బోటు బయల్దేరినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మృతులను ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Vijayawada
bhavani island
vijayawada boat accident

More Telugu News