టీచర్ల దుశ్చర్య... అన్నం తినే ప్లేట్లతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు!

11-11-2017 Sat 09:17 | National
  • మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం
  • అన్నం తినే ప్లేట్లతో విద్యార్థులతో టాయిలెట్లు క్లీన్ చేయించిన వైనం 
  • తల్లిదండ్రులకు పిల్లల ఫిర్యాదు... నిలదీసిన పెద్దలు
  • ఖండించిన టీచర్లు... విచారణకు కలెక్టర్ ఆదేశం
మధ్యప్రదేశ్‌ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు... తాము అన్నం తినే ప్లేట్లతో టాయిలెట్‌ లోని మలాన్ని ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.

దీంతో వారంతా నిన్న స్కూలులో ఆందోళన చేపట్టారు. అయితే పిల్లల తల్లిదండ్రుల ఆరోపణలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారని చెప్పారు. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉందని, అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై వార్తలు వెలువడడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
schoolmadhyapradeshteachersshit

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more