Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తేజ సెంటిమెంట్ .. 'నేనే రాజు నేనే మంత్రి' తరహాలో 'ఆటా నాదే వేటా నాదే'

  • వెంకటేశ్ తో తేజ తాజా చిత్రం 
  • టైటిల్ విషయంలో తేజ సెంటిమెంట్ 
  • డిసెంబర్ 13న షూటింగ్ మొదలు 
  • ఆ దిశగా జరుగుతోన్న సన్నాహాలు  
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ కొట్టడంతో, తేజతో సినిమా చేయడానికి వెంకటేశ్ ఆసక్తిని చూపించారు. దాంతో ఆయనకి తగిన కథను సిద్ధం చేసుకుని తేజ ఒప్పించాడు. ఫలితంగా డిసెంబర్ 13న ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో తేజ - వెంకటేశ్ వున్నట్టుగా సమాచారం.

గతంలో 'చిత్రం' సినిమా హిట్ కావడంతో ఆ తరువాత తేజ అదే సెంటిమెంట్ ను పాటిస్తూ, చివరిలో 'సున్నా' వచ్చే విధంగా టైటిల్స్  పెడుతూ వచ్చాడు. ఇక ఇటీవల తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ కావడంతో, అదే తరహాలో .. అదే సెంటిమెంట్ తో తేజ 'ఆటా నాదే వేటా నాదే' టైటిల్ ను సెట్ చేయనున్నట్టు చెబుతున్నారు. టైటిల్ ని బట్టి చూస్తుంటే వెంకటేశ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా వుండనున్నట్టు అనిపిస్తోంది. 
venkatesh
teja

More Telugu News