అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ, రాహుల్

  • నేడు అద్వానీ 90వ జన్మదినం
  • వెల్లువెత్తుతున్న ప్రముఖుల శుభాకాంక్షలు
  • దేశం కోసం అద్వానీ అకుంఠిత దీక్షతో పనిచేశారన్న మోదీ
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ 90వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు అందుతున్నాయి. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన అద్వానీ గారికి శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. "అద్వానీ ఒక రాజకీయ దిగ్గజం, ఒక మహానేత. దేశం కోసం అకుంఠిత దీక్షతో పని చేశారు. అద్వానీ నుంచి సలహాలు తీసుకోవడానికి బీజేపీ కార్యకర్తలంతా అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు. బీజేపీ ఎదగడానికి అద్వానీ చేసిన కృషి మరిచిపోలేనిది", అని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "అద్వానీ గారూ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యావ్ ఏ లవ్లీ డే" అంటూ ట్వీట్ చేశారు. 
lk advani
advani birthday
Narendra Modi
Rahul Gandhi
BJP
Congress

More Telugu News