సీనియర్ హీరోల సినిమా అంటే కాజల్ ఎక్కువ పారితోషికం అడిగేస్తోందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీనియర్ హీరోల సినిమా అంటే కాజల్ ఎక్కువ పారితోషికం అడిగేస్తోందట!

  • తెలుగులో రెండు భారీ హిట్స్ దక్కించుకున్న కాజల్ 
  • తమిళంలో 'మెర్సల్' తో మరో బ్లాక్ బస్టర్ 
  • కాజల్ కి పెరుగుతోన్న డిమాండ్ 
  • తెలివైన నిర్ణయం తీసుకున్న కాజల్
ఈ మధ్య కాజల్ టైమ్ నడుస్తోందనే చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి సరసన ఆమె చేసిన 'ఖైదీ నెంబర్ 150' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత రానాతో ఆమె చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాన్ని అందుకుంది. ఇక విజయ్ జోడీగా తమిళంలో చేసిన 'మెర్సల్' ఒక రేంజ్ హిట్ ను ఆమె ఖాతాలో జమ చేసింది. దాంతో కాజల్ డిమాండ్ మళ్లీ పెరిగిపోయింది.

తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు .. హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. అయితే సీనియర్ హీరోలతో చేయాలంటే కాజల్ ఎక్కువ పారితోషికం అడుగుతోందట. సీనియర్ హీరోలతో చేస్తే .. యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి గనుక, ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిందే అంటోందట. అలా తేజ దర్శకత్వంలో వెంకటేశ్ తో చేస్తోన్న సినిమాకి కూడా పెద్ద మొత్తమే తీసుకుంటోందని అంటున్నారు.
Kajal Agarwal

More Telugu News