Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హార్దిక్ పాండ్య డ్రెస్సింగ్ రూమ్ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టిన విరాట్‌!

  • హార్దిక్ ఐపాడ్‌లో అన్నీ ఇంగ్లిషు పాట‌లే ఉంటాయి
  • వాటిలో ఒక్క పాట ప‌దాలు కూడా హార్దిక్‌కి తెలియ‌వు
  • ఊరికే మ్యూజిక్ వ‌స్తుంటే త‌లూపుతుంటాడు
అన‌తి కాలంలోనే హార్దిక్ పాండ్య‌ టీమిండియాలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్‌, టాటూల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు హార్దిక్‌. ఆల్ రౌండ‌ర్‌గా మైదానంలో అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచే హార్దిక్ పాండ్య గురించి జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ర‌హ‌స్యం బ‌య‌ట‌పెట్టాడు. హార్దిక్‌కి పాట‌లంటే చాలా ఇష్టమ‌ట‌. ఐపాడ్ ఎప్పుడూ త‌న‌తో పాటే ఉంచుకుంటాడ‌ట‌. ఆ ఐపాడ్‌లో ఉండే పాట‌ల వివ‌రాల‌ను విరాట్ తాజాగా బ‌య‌ట‌పెట్టాడు. ఇటీవ‌ల `బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియ‌న్స్‌` కార్య‌క్ర‌మంలో విరాట్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించాడు.

`సాధార‌ణంగా డ్రెస్సింగ్ రూంలో పంజాబీ సంగీతం ఎక్కువ వింటుంటాం. ఆట‌గాళ్లెవ‌రూ త‌మ ఐపాడ్ల‌ను డ్రెస్సింగ్ రూంకి తీసుకురారు, ఒక్క హార్దిక్ త‌ప్ప‌. హార్దిక్ ఐపాడ్‌లో అన్నీ ఇంగ్లిషు పాట‌లే ఉంటాయి. కానీ వాటిలో ఒక్క పాట‌కు కూడా లిరిక్స్ హార్దిక్‌కి తెలియ‌వు. కేవ‌లం పాట‌తో పాటు వ‌చ్చే సంగీతానికి త‌లూపుతుంటాడు. అత‌ని పాట‌ల‌న్నీ మాకు చిరాకు తెప్పిస్తుంటాయి` అని విరాట్ తెలిపాడు.
hardik pandya
Virat Kohli
dressing secrets
ipad
songs
english
punjabi

More Telugu News