ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం.. వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం!
- ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్
- స్వీకరించిన సుప్రీంకోర్టు
- తాజా పిల్ జత చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించింది. దాంతో పాటు ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది.