వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- వాహనదారుల అసహనం
- వెనకకు వెళ్లలేక, ముందుకు కదలలేక నరకం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతుండడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ ఫ్లైఓవర్, క్రౌన్‌కేఫ్, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి రోడ్ మార్గాల్లో, జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, జర్నలిస్ట్ కాలనీ, బీవీబీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. వెనకకు వెళ్లలేక, ముందుకు కదలలేక వాహనదారులు నరకాన్ని చూస్తున్నారు.