ఇద్దరికీ మాత్రమే సరిపోయే ఈ పిజ్జా ధర అక్షరాల రూ. 77 లక్షలు
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన పిజ్జా
- ఈ పిజ్జా పేరు లూయిస్ 13
- అరుదైన పదార్థాలు వాడటమే ఈ ధరకు కారణం
చాలా అరుదుగా లభించే పదార్థాలను ఈ పిజ్జా తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో ఆస్ట్రేలియన్ పింక్ సాల్ట్, బ్లాక్ కైవర్ శాంపైన్, సేంద్రీయంగా ఉత్పత్తి అయిన మోజరెల్లా ఛీజ్, వైన్‌లో నానబెట్టిన నార్వే లాబ్‌స్టార్ మాంసం, మధ్యదరా సముద్రం ప్రాంతంలో దొరికే రొయ్యలు, మిడతలను ఈ పిజ్జా తయారీకి వినియోగిస్తారు. ఇవి యూరప్‌లో చాలా అరుదుగా లభించే పదార్థాలు. వీటిని ఒక పద్ధతిలో ఉడికించి పిజ్జా టాపింగ్స్‌గా ఉపయోగిస్తామని రెనాటో చెప్పాడు.