బ్యాటింగ్, బౌలింగే కాదు, గాల్లో ఎగరగలనని నిరూపించిన పాండ్యా... అబ్బురపరుస్తున్న వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాటింగ్, బౌలింగే కాదు, గాల్లో ఎగరగలనని నిరూపించిన పాండ్యా... అబ్బురపరుస్తున్న వీడియో!

  • ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ లో నిరూపించుకున్న పాండ్యా
  • న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అద్భుత ఫీల్డింగ్ ప్రతిభ
  • 14 అడుగులు గాల్లో ఎగురుతూ క్యాచ్
హార్దిక్ పాండ్యా... తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను, వికెట్ కావాల్సి వచ్చిన ప్రతిసారీ రంగంలోకి దిగి ఆదుకుంటాడన్న పేరును సంపాదించుకున్న క్రికెటర్. ఇక నిన్న న్యూజిలాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో పాండ్యాకున్న మరో అద్భుత నైపుణ్యం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్ ఆటగాడు కొట్టిన క్యాచ్ ని అందుకునేందుకు అద్భుత రీతిలో డైవ్ చేశాడు. పాండ్యా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జాంటీ రోడ్స్ ను మించిన ప్రతిభ చూపించాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



india
newzealand
pandya
catch

More Telugu News