ఇంకాస్త పెరిగిన వంట‌గ్యాస్‌ సిలిండర్ ధర!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకాస్త పెరిగిన వంట‌గ్యాస్‌ సిలిండర్ ధర!

  • మ‌రో రూ.4.50 పెరిగి రూ.495.69కి చేరిన సబ్సిడీ సిలిండర్‌ ధర
  • సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742
  • మొత్తం సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు 18.11 కోట్ల మంది
వంట‌గ్యాస్‌ సిలిండర్ ధర మ‌రో రూ.4.50 పెరిగిపోయింది. దీంతో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.495.69కి చేరింది. మ‌రోవైపు సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.742గా న‌మోదైంది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్‌ను బట్టి నెలవారీగా నిర్ణయిస్తున్నారు. దేశంలో మొత్తం సబ్సిడీ వంటగ్యాస్‌ వినియోగదారులు 18.11 కోట్ల మంది ఉండ‌గా, సబ్సిడీయేతర వంటగ్యాస్‌ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు. స‌బ్సిడీ పొందుతోన్న వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్‌ సిలిండర్లను ఏడాదికి 12 వినియోగించుకోవ‌చ్చు. ఏడాదిలో 12 సిలిండ‌ర్ల కంటే ఎక్కువ‌గా వాడితే వాటికి స‌బ్సిడీ రాదు.
Gas
cylinder

More Telugu News