వీవీఎస్ లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ రహస్యం చెప్పిన సచిన్
- లక్ష్మణ్ పరుగుల వెనక రహస్యం గురించి మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్
- లక్ష్మణ్ బ్యాటింగ్‌కి వెళ్లేముందు స్నానం చేసి, యాపిల్ తింటాడట
- తమదైన శైలిలో విషెస్ చెప్పిన సెహ్వాగ్, ఇతర క్రికెటర్లు
అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా తనదైన శైలిలో ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. అప్పట్లో లక్ష్మణ్‌ను ముద్దుగా మణికట్టు మాంత్రికుడు అని పిలిచేవాళ్లు. అందుకే సెహ్వాగ్, లక్ష్మణ్ చేతులను ‘రాయ్’ సినిమాలోని ‘చిటియాన్ కలైయాన్’ పాటతో పోల్చాడు. ‘రిస్ట్ జాదుగర్, భారత శ్రీ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన మణికట్టు మాయతో అనుగుణంగా మార్చేస్తాడు. చిటియాన్ కలైయాన్’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఇంకా సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్‌లతో పాటు ఐసీసీ, బీసీసీఐ సంస్థలు కూడా లక్ష్మణ్‌కి శుభాకాంక్షలు తెలిపాయి. 1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన లక్ష్మణ్ అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించి, 2012లో ఆడిలైట్‌లో జరిగిన టెస్టు అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.