కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు రాహుల్ చాలా సంతోషపడ్డారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు రాహుల్ చాలా సంతోషపడ్డారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మీరంతా కాంగ్రెస్‌ కుటుంబంలో సభ్యులయ్యారు
  • పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తా
  • రాహుల్ గాంధీ ప‌లికిన మాట‌ల‌ను వివ‌రించిన ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి
కొడంగ‌ల్ నేత‌ రేవంత్ రెడ్డి త‌మ పార్టీలో చేరిన నేప‌థ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ త‌మ‌ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని అన్నార‌ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు 18 మంది నేత‌లు త‌మ పార్టీలో చేరిన నేప‌థ్యంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు వీరంతా కాంగ్రెస్‌ కుటుంబంలో సభ్యులయ్యారని రాహుల్ గాంధీ అన్నార‌ని చెప్పారు.

పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తాన‌ని రాహుల్ చెప్పార‌ని తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన త‌రువాత ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితో పాటు మీడియా ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
utham
revanth
rahul

More Telugu News