విశాఖలో గంజాయి అమ్మకాలు ఇలానే కొనసాగితే ఒక తరం నాశనమవుతుంది: ఏపీ డీజీపీ సాంబశివరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో గంజాయి అమ్మకాలు ఇలానే కొనసాగితే ఒక తరం నాశనమవుతుంది: ఏపీ డీజీపీ సాంబశివరావు

  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ
  • కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించాం
  • గంజాయి అక్రమ రవాణాను అరికడతాం
  • నిర్భయ ఫండ్ నుంచి ఏపీకి రూ.7 కోట్లు విడుదలయ్యాయి
విశాఖపట్టణంలో గంజాయి అమ్మకాలు ఇలానే కనుక కొనసాగితే ఒక తరం పూర్తిగా నాశనమవుతుందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి ఎక్సైజ్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామని, ఆధారాలు లేకపోతే డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని, తిరుపతి, విశాఖ, గుంటూరులో వరుసగా జరిగిన రౌడీ షీటర్ల హత్యలకు గల కారణాలేమిటో తెలుసుకుంటామని అన్నారు.

 చెన్నై-కోల్ కతా హైవేపై ఐదు నుంచి పది శాతం ప్రమాద మరణాలు తగ్గాయని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించానని, యుటిలైజేషన్ సర్టిఫికెట్లలో జాప్యం వల్ల నిధులు రాలేదని చెప్పారు. ఎస్ఆర్ఎస్, ఎస్ఐఎస్పీ పథకాల కింద కేంద్రం నిధులు ఇస్తోందని, రోడ్ల అభివృద్ధి కోసం రూ.1,200 కోట్లు విడుదల చేశామని, నిర్భయ ఫండ్ నుంచి ఏపీకి రూ.7 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. భద్రత కోసం ఓ యాప్ ను రూపొందించి పెట్రోలింగ్ పెంచుతున్నామని, ఆధునికీకరణ కోసం పోలీస్ శాఖకు రూ.70 కోట్లు ఇచ్చారని, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం కోసం రెండు వేల ఎకరాలు అటవీ భూమి అడిగామని సాంబశివరావు చెప్పారు.
డీజీపీ సాంబశివరావు
విశాఖపట్టణం

More Telugu News