చంద్ర‌బాబుతో భేటీ అయిన టీటీడీపీ నేత‌లు

  • రాజీనామా చేసి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి
  • భేటీలో పాల్గొన్న ఎల్‌.రమణ, మోత్కుపల్లి, గరికపాటి, అరవింద్‌కుమార్‌ గౌడ్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ‌లో తెలంగాణ టీడీపీ నేత‌లతో స‌మావేశ‌మ‌య్యారు. నిన్న టీటీడీపీ నేత‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశం అసంపూర్తిగానే ముగిసిన విష‌యం తెలిసిందే. త‌మ పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంపై ఈ రోజు చ‌ర్చించాల‌నుకున్నారు. ఈ స‌మావేశంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన రేవంత్ రెడ్డి పార్టీకి, పార్టీ ప‌ద‌వుల‌కి రాజీనామా చేసి వెళ్లి పోవ‌డంతో రేవంత్ రెడ్డి విష‌యంపై ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై, తెలంగాణ పార్టీ కార్య‌కలాపాల‌పై చంద్ర‌బాబు కీల‌క చ‌ర్చ జ‌రుపుతున్నారు. ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణతో పాటు మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి, అరవింద్‌కుమార్‌ గౌడ్ పాల్గొంటున్నారు.
Go Back to Shorts
revant reddy
congress
l ramana
Telugudesam
chandrababu

More Telugu News