ధోని కుమార్తె పాటకు ఫిదా అయిన కేరళ ఆలయ నిర్వాహ‌కులు... ప్ర‌త్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం

  • మ‌ల‌యాళం భ‌క్తి పాట పాడిన జీవా
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన జీవా పాట‌
  • కృష్ణుడి పండ‌గ‌కు రావాల‌ని ఆహ్వానం
సెల‌బ్రెటీల పిల్ల‌లు ఏది చేసినా వైర‌లే.. అదేంటో వారు ఏం చేసినా చాలా ముద్దుగా అనిపిస్తుంది. అదే బాట‌లో ఇటీవ‌ల భార‌త క్రికెట‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని కుమార్తె జీవా పాడిన ఓ మ‌ల‌యాళం భ‌క్తి పాట కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన కేర‌ళ‌లోని అంబాల‌పుర ప్రాంతంలోని శ్రీ కృష్ణ దేవాల‌యం నిర్వాహ‌కులు జీవా పాట‌కు ఫిదా అయ్యారు. దీంతో జ‌న‌వ‌రి 14న ఆల‌యంలో జ‌ర‌గ‌నున్న కృష్ణుడి పండ‌గ‌కు జీవాను ప్ర‌త్యేక అతిథిగా రావాలని ఆహ్వానం కూడా పంపారు.

జీవా ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో మూడు రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేశారు. 1992లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం `అద్వైతం`లోని భ‌క్తి పాట‌ను జీవా ముద్దు ముద్దుగా ఆల‌పించ‌డం ఈ వీడియోలో చూడొచ్చు. కేర‌ళ‌కు చెందిన త‌న అమ్మ‌మ్మ షీలా ఈ పాట‌ను నేర్పించినట్లు వీడియోతో పాటు పెట్టిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

ms dhoni
jiiva
song
devotional song
kerala
alapuzha
ambalappuzha
krishna temple

More Telugu News