'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సినీ హీరో రవితేజ!
- బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన 'సీక్రెట్ సూపర్ స్టార్'
- నిజాయతీతో కూడిన గొప్ప సినిమా
- ఈ సినిమాలో ఆర్టిస్టుల నటన అద్భుతం
- టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుంది
దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని ఎంతో చక్కగా తీశాడని అన్నాడు. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుందని కొనియాడాడు. ఇటువంటి సినిమాలు విజయాన్ని సాధిస్తాయని అన్నాడు. రవితేజ తాజాగా 'రాజా ది గ్రేట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు మంచి స్పందన వస్తోంది.