రోహన్ ను అమెరికాలోని యాక్టింగ్ స్కూల్లో చేర్పించిన శ్రీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోహన్ ను అమెరికాలోని యాక్టింగ్ స్కూల్లో చేర్పించిన శ్రీకాంత్

  • మరో మూడేళ్ల తర్వాత నటిస్తాడు
  • నేను నటించిన రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి
  • మరో రెండు సినిమాల షూటింగ్ ప్రారంభకానుంది
ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోహన్ 'నిర్మలా కాన్వెంట్' సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రోహన్ మళ్లీ కనిపించలేదు. దీనిపై శ్రీకాంత్ స్పందించాడు. రోహన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని, అక్కడ ఓ యాక్టింగ్ స్కూల్లో చేరాడని చెప్పాడు. మరో మూడేళ్ల తర్వాతే సినిమాల్లో నటిస్తాడని తెలిపాడు. తాను నటించిన 'రారా' సినిమా వచ్చే నెల 17న విడుదల కానుందని చెప్పాడు. మలయాళంలో మోహన్ లాల్ తో కలసి నటించిన సినిమా శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపాడు. కన్నడలో కూడా ఓ సినిమా చేస్తున్నానని, మరో రెండు సినిమాల షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పాడు.
actor srikanth
hero rohan
tollywood

More Telugu News