ఆసక్తికర దృశ్యం.. కాంగ్రెస్ నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
- హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఘటన
- రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న ఎమ్మెల్యే సంపత్
హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర దృశ్యం కనపడింది. పార్టీ మారతారని అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతేకాదు, ఎమ్మెల్యే సంపత్.. రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత కాంగ్రెస్ నేతలంతా కలిసి బయటకు వచ్చారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి వారికి కనపడగా ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు నేతలంతా పరస్పరం నవ్వుతూ మాట్లాడుకున్న దృశ్యాలు మీడియాలో వైరల్గా మారాయి.