తూచ్... అది పైరసీ సినిమా కాదు... మాట మార్చిన రాజా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తూచ్... అది పైరసీ సినిమా కాదు... మాట మార్చిన రాజా!

  • మొబైల్ లో 'మెర్సల్' సినిమా చూడలేదు
  • నాకు వచ్చిన కొన్ని సీన్స్ చూశానంతే
  • వివరణ ఇచ్చిన బీజేపీ నేత రాజా
  • నాపై ఆరోపణల వెనుక కొందరి కుట్ర: రాజా
తాజా చిత్రం 'మెర్సల్'ను మొబైల్ లో చూశానని, అందులోని డైలాగులు అభ్యంతరకరమని బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, నష్ట నివారణకు ఆయన దిగొచ్చారు. ఓ ప్రముఖ రాజకీయ నేతగా ఉండి, అధికారంలో ఉంటూ, పైరసీని అరికట్టాల్సిన వ్యక్తి, ఇలా మొబైల్ లో సినిమా చూశానని చెప్పడం సిగ్గు చేటని పలు వర్గాలు, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్న వేళ రాజా స్పందించారు.

తాను 'మెర్సల్' చిత్రాన్ని పైరసీలో చూడలేదని, కేవలం తన మొబైల్ కు వచ్చిన వీడియోలను మాత్రమే చూశానని అన్నారు. తన ఫోన్ కు వచ్చే వీడియోలను తానెందుకు చూడరాదని ఎదురు ప్రశ్నించారు. తాను 'మెర్సల్' చిత్రం పైరసీని చూశానని ఆరోపిస్తుండటం వెనుక కొందరి కుట్ర దాగుందని ఆరోపణలు చేశారు. సినిమాలో విమర్శనాత్మకంగా ఉన్న డైలాగులను ఎవరో తనకు పంపారని, తాను వాటిని చూసి, అదే విషయాన్ని మీడియాకు చెప్పానని రాజా అన్నారు.
mercel
h raja
bjp

More Telugu News