దొంగను కాపాడేందుకు 50 వేలు లంచం తీసుకున్న బీజేపీ మహిళా నేత అరెస్టు!
- కుమారుడి కేసు విషయంలో బీజేపీ మహిళా నేతను ఆశ్రయించిన తల్లి
- 50,000 రూపాయలిస్తే కాపాడతానని హామీ
- డబ్బులిచ్చినా జైలు కెళ్లిన కుమారుడు
తన కుమారుడ్ని ఎలాగైనా కాపాడాలని, జైలుకు వెళ్లకుండా చూడాలని వేడుకున్నారు. దీంతో ఆమె యాభై వేల రూపాయలు ఇస్తే హర్షిత్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుతానని చెప్పారు. దీంతో ఆమె అడిగినట్టే డబ్బులు తెచ్చి ఇచ్చారు. అయితే పోలీసులు హర్షిత్ పాండేను జైలుకి పంపారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రీటా పాండే నేరుగా సీఎం యోగిఆదిత్యనాథ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో యోగి ఆదేశాలతో పోలీసులు సదరు మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు.