వేడి వేడిగా కమ్మని వాసనతో ఊరిస్తోన్న కాఫీ క‌ప్పులో బొద్దింక కాళ్లు!

20-10-2017 Fri 17:10 | Offbeat
  • మెక్‌ డోనాల్డ్స్ లో వినియోగదారుడికి చేదు అనుభవం
  • రెండు కప్పుల కాఫీ తెప్పించుకుంటే రెండుసార్లూ బొద్దింక కాళ్లు వచ్చిన వైనం
  • సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన థాయిలాండ్‌ వాసి
కమ్మ‌టి కాఫీ రుచి కోసం మెక్‌ డోనాల్డ్స్ లోకి వెళ్లిన ఓ క‌స్ట‌మ‌ర్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌కు ఇచ్చిన‌ కాఫీలో బొద్దింక‌ కాళ్లు క‌న‌ప‌డ్డాయి. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, బ్యాంకాక్‌ కు చెందిన నోస్టాలిక్‌ ఐక్‌ (28) అనే వ్య‌క్తి స్థానికంగా ఉండే మెక్‌డోనాల్డ్స్ కి వెళ్లి కాఫీ ఆర్డ‌ర్ చేశాడు. ఆ కాఫీలో బొద్దింక కాళ్లు క‌నిపించ‌డంతో మ‌రో కప్పులో కాఫీ తెప్పించుకున్నాడు.

అయితే, ఈ సారి తెచ్చిన కాఫీలోనూ బొద్దింక కాళ్లు క‌నప‌డ‌డంతో ఆయ‌న త‌న స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు. మెక్‌డొనాల్డ్ లో అధిక శుభ్రత పాటిస్తార‌ని తాను అనుకున్నాన‌ని, అయితే, ఇటువంటి అనుభ‌వం ఎదురైంద‌ని పేర్కొన్నాడు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన‌ మెక్‌డొనాల్డ్స్ ప్ర‌తినిధులు స‌ద‌రు వినియోగదారుడికి క్షమాపణలు చెప్పారు. దీనిపై విచారణ చేపడ‌తామ‌ని తెలిపింది. 
కాఫీ క‌ప్పుబొద్దింక కాళ్లు

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more