విజయ్ `మెర్సల్` చిత్రంపై మండిపడుతున్న తమిళ బీజేపీ నేతలు!
- జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను తప్పుగా చూపించారని ఆరోపణ
- మోదీ భావజాలన్ని తప్పుదోవ పట్టించారని వ్యాఖ్య
- సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
మరోపక్క `మెర్సల్` చిత్రంలో భారత్, సింగపూర్ దేశాలను పోల్చుతూ విజయ్ పాత్ర చెప్పిన డైలాగులు తప్పుడుతడకలుగా ఉన్నాయని బీజేపీ యూత్ వింగ్ నేత ఎస్జీ సూర్య ట్విట్టర్లో పేర్కొన్నారు. 7 శాతం జీఎస్టీ అమల్లో ఉన్న సింగపూర్లో ప్రజలకు ఉచిత వైద్యసహాయం అందుతుందని, అదే 28 శాతం జీఎస్టీ కడుతున్నప్పటికీ భారతీయులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని సినిమాలో ఓ సన్నివేశంలో విజయ్ పాత్ర చెబుతుంది.