అజయ్ దేవగణ్ ఎప్పుడు అడిగినా నటించేందుకు సిద్ధమంటున్న బాలీవుడ్ నటి
- 'విజయ్ పథ్', 'తక్షక్', 'దృశ్యం' సినిమాల్లో అజయ్ దేవగణ్ తో కలిసి నటించిన టబు
- 'గోల్ మాల్ అగైన్' లో మరోసారి జతకట్టిన టబు
- అజయ్, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం
అజయ్ హీరోగా నటించినా, దర్శకుడుగా మారినా, నిర్మాతగా మారినా.. ఆయన సినిమాలో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పింది. తాజాగా తామిద్దరం మరోసినిమాకు సంతకం చేశామని తెలిపింది.
ఇదిలా ఉంచితే, 'గోల్ మాల్ అగైన్' సినిమా నేడు విడుదల కానుంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మూడో భాగంగా వస్తోంది.