మైదానంలో పెను ప్రమాదం నుంచి బయటపడిన శ్రీలంక క్రికెటర్!

20-10-2017 Fri 07:55 | Sports
  • కీపర్ విసిరిన బంతిని గుర్తించకపోవడంతో ప్రమాదం
  • కపుగెదర ముఖాన్ని తీవ్రంగా గాయపరిచిన బంతి
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న శ్రీలంక వెటరన్
శ్రీలంక వెటరన్ ఆటగాడు చమర కపుగెదర తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అబుదాబిలో పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ బ్యాటింగ్  ప్రారంభించింది. ఈ క్రమంలో పదో ఓవర్ ముగిశాక వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా బంతిని అందుకుని దూరంగా వెళ్తున్న కపుగెదరవైపు విసిరాడు. అయితే కీపర్ బంతి విసరడాన్ని కపుగెదర గమనించకపోవడంతో బంతి వేగంగా వచ్చి అతడి ముఖాన్ని బలంగా తాకింది.

అయితే, కంటికి కొద్దిగా కింద తగలడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే కన్ను పోయి ఉండేది. బంతి తాకడంతో కంటిపై పెద్ద బొడిపె ఏర్పడింది. దీంతో వెంటనే అతడిని వైద్యం కోసం తరలించారు. కపుగెదర పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదిలా ఉంచితే, మైదానంలో గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి గీమల్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ కాగా, బంతి అదే వేగంతో దూసుకెళ్లి వికెట్ల వెనక ఉన్న బౌచర్ ముఖాన్ని గాయపరిచింది.  
Chamara KapugedarasrilankapakistanNiroshan Dickwella

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more