సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

19-10-2017 Thu 07:38 | Entertainment
  • సంగీతం నేర్చుకుంటున్న నిత్యా మీనన్ 
  • క్యాబ్ డ్రైవర్ పాత్రలో విజయ్ దేవరకొండ 
  • హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో తాప్సీ 
  • వచ్చే నెలలో సుమంత్ 'మళ్లీ రావా'!  
*  కథానాయిక నిత్యామీనన్ ఇప్పుడు సంగీతం నేర్చుకుంటోంది. అవును, ఈ ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే ఇష్టమట. దాంతో ఇప్పుడు హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకుంటోంది. అన్నట్టు, గతంలో ఈ చిన్నది రెండు మూడు పాటలు పాడిన సంగతి విదితమే.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ ఇలా క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది.
*   ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతున్నాడు. ఇందుకోసం ఓ లేడీ ఓరియెంటెడ్ కథను తయారుచేసుకున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం ప్రస్తుతం తాప్సీని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
*  'నరుడా డోనరుడా' చిత్రం తర్వాత సుమంత్ చేస్తున్న చిత్రం 'మళ్లీ రావా'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించింది. 
Nityamenonvijaytapsi

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more