హర్షితను నా భర్తే చంపించాడు: గాయని హర్షిత చెల్లెలు లత
- గతంలో హర్షితను రేప్ చేయబోయిన లత భర్త
- ఇటీవల తనను బెదిరిస్తున్నారంటూ వీడియో పోస్ట్ చేసిన హర్షిత
- దర్యాప్తు ప్రారంభించిన హర్యానా పోలీసులు
గతంలో హర్షిత కూడా తన చెల్లెలి భర్త తనను రేప్ చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనను కొంతమంది బెదిరిస్తున్నారని హర్షిత ఒక వీడియో పోస్ట్ చేసింది. పరిశ్రమకు చెందిన కొంతమంది తాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె వీడియోలో పేర్కొంది. అయితే ఆమె ఫేస్‌బుక్‌లో చాలా లైవ్ వీడియోలు ఉండటంతో ఆమె ఏ వీడియో గురించి మాట్లాడిందో తెలియరాలేదు. ఆ బెదిరించిన వారే కాల్చి చంపి ఉంటారన్న కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు.