షాకింగ్... ప్రియుడ్ని పెళ్లాడేందుకు కిడ్నీ అమ్మాలని నిర్ణయించుకున్న యువతి!

18-10-2017 Wed 11:15 | National
  • పెళ్లైన కొన్ని నెలలకే విభేదాలతో భర్త నుంచి విడిపోయిన యువతి
  • మరొకరి ప్రేమలో పడిన వైనం.. ప్రియుడిని పెళ్లాడేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు
  • కట్నం అడిగిన ప్రియుడు
ప్రియుడిని పెళ్లాడేందుకు కిడ్నీ అమ్మేందుకు బీహార్ యువతి సిద్ధపడడం దేశరాజధానిలో కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన యువతి (21)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. అయితే విభేదాల నేపథ్యంలో పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని పెద్దలకు చెప్పింది. దానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

దీంతో అతనితో వెళ్లిపోయేందుకు కూడా సిద్ధపడింది. అయితే అబ్బాయి మాత్రం కట్నం లేనిదే వివాహం కుదరదని తెగేసి చెప్పాడు. 1.8 లక్షల రూపాయల కట్నం కావాలని డిమాండ్ చేశాడు. అతనితో వివాహానికే అంగీకరించని తల్లిదండ్రులు, కట్నం ఇచ్చే పరిస్థితి అసలే లేదని తేల్చి చెప్పేశారు.  

ఈ నేపథ్యంలో బాగా ఆలోచించిన యువతి, కిడ్నీ అమ్మడం ద్వారా డబ్బులు సమకూర్చుకుని ప్రియుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఢిల్లీ చేరింది. ఒక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి, కిడ్నీ దానం చేయాలనుకుంటున్నానని తెలిపింది. కానీ అక్కడి వైద్యులకు ఆమె కిడ్నీ అమ్ముతున్నట్టు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను విచారించిన పోలీసులు జరిగిన తతంగం మొత్తం తెలుసుకుని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రియుడిపై ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అయితే కిడ్నీ అమ్మకాన్ని విరమించుకున్న ఆమె, ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం నిరాకరించి, తిరిగి బీహార్ వెళ్లిపోయింది. 
lovemarriagelover demand dorykidneykidney sell

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more