'రచ్చ' షూటింగులో పడిపోయిన దగ్గర నుంచే పుకార్లు మొదలయ్యాయి: హాస్యనటుడు వేణుమాధవ్

17-10-2017 Tue 16:07 | Entertainment
  • వేణుమాధవ్ కి ఫిట్స్ వున్నాయంటూ ప్రచారం 
  • అందులో నిజం లేదంటూ ఆయన సమాధానం 
  • తరచూ పడిపోతుంటాననేది అబద్ధం
వేణుమాధవ్ కి ఫిట్స్ ఉన్నాయనీ .. షూటింగ్స్ లో ఆయన పడిపోతూ ఉంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ కారణంగానే ఆయనకి ఛాన్సులు తగ్గాయని చెప్పుకుంటూ వుంటారు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్స్  ప్రస్తావించగా .. ఆయన తనదైన శైలిలో స్పందించారు. తనకి ఫిట్స్ లేవనీ .. ఇదంతా పుకారు మాత్రమేనని అన్నారు.

 'రచ్చ' సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే, మరో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండేవాడినని వేణుమాధవ్ చెప్పారు. ఆ సినిమాల షూటింగ్స్ చూసుకుని 'రచ్చ' సెట్ కి వచ్చేవాడినని అన్నారు. అందువలన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ .. నైట్ డిన్నర్ చేయడం కుదిరేది కాదని చెప్పారు. దాంతో ఓ రోజున కళ్లు తిరిగి 'రచ్చ' షూటింగులో పడిపోయాననీ, అప్పటి నుంచి తనపై అనేక పుకార్లు రావడం మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక 'బృందావనం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కార్యక్రమం 'జీన్స్'కి వెళ్లినప్పుడు, అక్కడ కూడా పడిపోయాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు.   
venumadhav

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more