రవితేజ చాలా గ్రేట్.. అంధుడిగా అద్భుతంగా నటించాడు!: రాజేంద్ర ప్రసాద్
- ‘రాజా ది గ్రేట్’ సినిమా ప్రీ- రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్
- ఏ నటుడు అయినా వెరైటీ పాత్రలు వేయాలని అనుకుంటాడు
- అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంధుడిగా నటించడం ఇదే మొదటిసారి
ఈ సినిమా తరువాత రవితేజను అందరూ 'ఓ గ్రేట్ యాక్టర్' అని అంటారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను హీరో వేషాలు వేసిన తరువాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్నానని, తనకి కూడా వెరైటీ పాత్రల్లో నటించాలని ఉంటుందని అన్నారు. ఈ సినిమా బృందం ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. 'సర్వేంద్రియానాం సర్వం ప్రధానం' అని ఈ సినిమా రుజువు చేస్తుందని అన్నారు.