గ్లామర్ పాత్రలు చేయనుగాక చేయను : కీర్తి సురేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్లామర్ పాత్రలు చేయనుగాక చేయను : కీర్తి సురేశ్

  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీగా కీర్తి సురేశ్
  • నటన పరమైన పాత్రలకే ప్రాధాన్యత  
  • వరుస సక్సెస్ లు .. యూత్ లో క్రేజ్ 
  • స్టార్ హీరోల సరసన అవకాశాలు
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకోవడానికి కీర్తి సురేశ్ కి ఎంతో కాలం పట్టలేదు. ఈ రెండు భాషల్లోను ఎంచుకున్న కథలు ఆమెకు వరుస సక్సెస్ లను .. క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దాంతో సహజంగానే ఆమెకి స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కాయి.

 నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సుందరి .. అందాల ప్రదర్శనకి తాను చాలా దూరమని చెప్పేసింది. అందాలను ఒలకబోసే పాత్రలకి తాను నప్పననీ, అందువలన ఆ తరహా పాత్రలను చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని అంది. ఇప్పుడే కాదు .. భవిష్యత్తులోను తాను ఇదే మాటపై ఉంటానని చెప్పింది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ సినిమాలోను .. 'మహానటి' మూవీలోను చేస్తున్నానని అంది. పవన్ తో మూవీ చాలా స్పెషల్ అనీ .. 'మహానటి' తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది.  
keerti suresh

More Telugu News