బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా.. 50 శాతం అదనపు టాక్‌ టైం ఆఫర్!

  • పలు టాప్ అప్‌లపై అధిక టాక్ టైం
  • ఆఫర్ ఆరు రోజులు మాత్రమే
  • మూడు టాప్ అప్‌లకే ఆఫర్ పరిమితం
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళిని పురస్కరించుకుని ‘లక్ష్మీ ప్రమోషనల్’ పేరిట అదనపు టాక్ టైం రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టింది. రూ.290, రూ.390, రూ.590 టాప్ అప్‌లపై అదనంగా 50 శాతం టాక్ టైంను అందిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఇది కేవలం మూడు టాప్ అప్‌లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. రూ.290 రీచార్జ్‌పై రూ.435, రూ.390 రీచార్జ్‌పై రూ.585, రూ.590 రీచార్జ్‌పై రూ.885 టాక్ టైంను అందిస్తున్నట్టు పేర్కొన్న బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ఈనెల 16 నుంచి 21 మధ్య రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

కాగా, ఇటీవల దసరా సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ‘దసరా విజయ్ ఆఫర్’ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రూ.42, రూ.44, రూ.69, రూ.88, రూ.122 వాయిస్‌ రీఛార్జ్‌లపై 50 శాతం అదనపు టాక్‌టైమ్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 25 మధ్య రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
Go Back to Shorts
BSNL
Talk time Offer
Diwali

More Telugu News