నాందేడ్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీపై చావుదెబ్బ... 54 స్థానాల్లో 49 కాంగ్రెస్ కైవసం
- పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
- 3 స్థానాలకు పరిమితమైన బీజేపీ
- ఉనికిని కోల్పోయిన ఎంఐఎం
గత ఎన్నికల్లో 11 మంది కార్పొరేటర్లను కలిగివున్న ఎంఐఎంకు కూడా ఈ ఎన్నికలు షాకిచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆ పార్టీ ఈ దఫా ఒక్క స్థానాన్ని కూడా పొందలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. బీజేపీపై ప్రజలకు ఆశలు ఎంతమాత్రమూ లేవని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.