గుజరాతీ తెలియక లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్ గాంధీ... ఫోటో చూడండి!
- గుజరాత్ లో ఉద్ధృతంగా సాగుతున్న రాహుల్ ప్రచారం
- యువతతో ముచ్చటించేందుకు 'సంవాద్'
- పొరపాటున లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్
- చదవడం రాకనే వెళ్లారన్న కాంగ్రెస్
అక్కడ ఉన్న టాయిలెట్ పురుషులదా? లేక స్త్రీలదా? అన్న సంకేత బొమ్మలు లేవు. కేవలం గుజరాతీలో 'మహిళల మరుగుదొడ్డి' అని మాత్రమే అక్కడ ఓ పేపర్ పై రాసుంది. అది చదవడం తెలియకనే రాహుల్ ఆ టాయిలెట్ లోకి వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లిన వెంటనే దాన్ని కవర్ చేసేందుకు మీడియా అత్యుత్సాహం చూపగా, ఎన్ఎస్జీ సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటికే కొందరు తమ కెమెరాల్లో ఈ దృశ్యాలను బంధించారు. రాహుల్ బయటకు రాగానే, స్థానికుల నుంచి ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి.