హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ఇకపై మాట్లాడబోనని హీరో హృతిక్ రోషన్ స్పష్టం చేశాడు. వారం క్రితం రెండు, మూడు టీవీ ఛానళ్లకు హృతిక్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత మరికొన్ని ఛానళ్లు ఇంటర్వూ కోసం హృతిక్ ను సంప్రదించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల్లోనే ఆ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని, ఆ ఇంటర్వ్యూలలో తన వాదనను వినిపించానని చెప్పాడు.

మర్యాద, సభ్యత, నాగరికత రీత్యా ఈ సమస్యను వివాదాస్పదం చేయకూడదని చెప్పాడు. ఇలాంటి సమస్యలపై నిరంతరం చర్చించడం వల్ల విపరీత పరిణామాలు ఎదురవుతాయని తెలిపాడు. ఈ విషయం మీడియాకు తెలుసని... అయితే, దీనిపై మీడియా రిపోర్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై తాను సలహాలను ఇవ్వబోనని చెప్పారు.