చైనా సైనికులతో మన రక్షణ మంత్రి ముచ్చట్లను స్వాగతించిన చైనా మీడియా!
- నిర్మలా సీతారామన్‌పై ప్రశంసల వర్షం
- సరిహద్దులో పర్యటించిన మంత్రి
- ద్వైపాక్షిక వాణిజ్యానికి తోడ్పాటు
సైనికులతో చొరవగా మసులుకోవడం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడి, ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇటీవల భారత్ - చైనాల మధ్య డోక్లాం ప్రాంతం విషయంలో సరిహద్దు వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ తమ సైనిక బలగాలను దింపడంతో దాదాపు 70 రోజుల పాటు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగిన చర్చల పుణ్యమాని ఇరుదేశాలు యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ణయించడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.