కంచ ఐలయ్య ఇంటికి కదిలిన వైశ్యులు... భారీ భద్రత!
- వైశ్యులతో చర్చించేది లేదని తేల్చి చెప్పిన ఐలయ్య
- తామే వస్తున్నామని కదిలిన వైశ్య సంఘాలు
- కలవనీయబోమని చెబుతున్న పోలీసులు
ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తాను రాసిన పుస్తకం సరైనదేనని ఆయన నిరూపించుకోవాలని కోరుతున్న వైశ్య సంఘాల నేతలు, ఐలయ్య ఇంటికి బయలుదేరగా, ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్యను, వైశ్యులను కలవనీయబోమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మీడియా కూడా ఐలయ్య ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంది.